Deputy CM: రాష్ట్రానికి సీఎంగా జగన్ లేదా పవన్ ఉండాలి: రాజన్న దొర - రాజన్న దొర
Deputy CM Press Meet: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో డిప్యూటీ సీఎం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రాజన్న దొర ప్రెస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ జెండాలు మోయడం కోసం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఉండకూడదని.. డిప్యూటీ సీఎం రాజన్న దొర అన్నారు.
అవసరమైతే అభిమాన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కోసం పోటీ చేసి కార్యకర్తలు అతని ముఖ్యమంత్రి అవ్వడానికి కృషి చేసినా పరవాలేదు. కానీ, పరాయి వాళ్ల కోసం పాటుపడకూడదని.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కోసం మీ పార్టీ కష్టపడకూడదని రాజన్న దొర అన్నారు. మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే జగన్మోహన్ రెడ్డి అయినా ఉండాలి లేదంటే నా అభిమాన జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ అయిన ఉండాలని... తెలుగుదేశం పార్టీపై విమర్శలు కురిపించారు.
రాజధాని రాకుండా తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు అడ్డుపడి అక్కడ ఇదివరకు అమరావతి రాజధాని అవకముందే రియల్ ఎస్టేట్ చేసి అక్కడ భూములు కొనుగోలు చేశారని.. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అనేసరికి అడ్డుపడుతున్నారని ఆయన పేర్కొన్నారు.