Parents Attacked on Librarian in Anantapur: అనంత కేంద్రీయ విద్యాలయంలో లైబ్రేరియన్ అరాచకం.. చితకబాదిన తల్లిదండ్రులు - sexual harassment Allegations in Anantapur
Parents Attacked on Librarian in Anantapur: అనంతపురం జిల్లాలో లైబ్రేరియన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి. విద్యార్థినిలతో లైబ్రేరియన్ ప్రవర్తన సరిగా ఉండటం లేదని.. పాఠశాలకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు అతనిని చితకబాదారు. అనంతపురం కేంద్రీయ విద్యాలయంలో లైబ్రేరియన్‌గా భానుప్రకాశ్ నాయక్ విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థినులను లైగింకంగా వేధిస్తున్నాడని.. పాఠశాలకు చేరుకున్న విద్యార్థినిల తల్లిదండ్రులు భాను ప్రకాశ్‌ను చితకబాదారు. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ.. ప్రిన్సిపల్ ఎదుటే లైబ్రేరియన్‌కు దేహశుద్ధి చేశారు. గత కొన్ని రోజులుగా లైబ్రేరియన్ విద్యార్థినిలను లైగింకంగా వేధిస్తున్నాడని ఆరోపించారు. దీనిపై ప్రిన్సిపల్కూ ఫిర్యాదు చేసినట్లు వారు వివరించారు. అయినప్పటికీ ప్రిన్సిపల్ స్పందించలేదని తెలిపారు. లైబ్రేరియన్‌ను తక్షణమే విధుల నుంచి తొలగించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. కేంద్రీయ విద్యాలయ ఉన్నతాధికారులతో తల్లిదండ్రులను ప్రిన్సిపాల్ కరీమ్‌ఖాన్ మాట్లాడించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడి.. లైంగిక ఆరోపణల గురించి వారికి వివరించారు. అయితే దీనిపై స్పందించిన భాను ప్రకాశ్.. తాను ఎటువంటి తప్పు చేయలేదని అన్నారు.