ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Parents_Agitation_In_School_on_Teacher_Misbehaving_With_Students

ETV Bharat / videos

Parents Agitation in School on Teacher Misbehaving With Students: "పిల్లలతో ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.. చర్యలు తీసుకోండి"

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 4, 2023, 2:59 PM IST

Parents Agitation in School on Teacher Misbehaving With Students: అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలంటూ.. విద్యార్థుల తల్లిదండ్రులు తూర్పు గోదావరి జిల్లాలోని ఓ పాఠశాల ఎదుట ధర్నా చేశారు. తమ పిల్లలతో ఆ ఉపాధ్యాయుడి తీరు సరిగా లేదని.. అసభ్యంగా మాట్లాడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్​ చేశారు. 

తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని పెరవలి మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో భౌతిక శాస్త్రం బోధిస్తున్న ఓ ఉపాధ్యాయుడు.. ఆయన బోధిస్తున్న పాఠశాలలోని విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థులు తల్లిదండ్రుల దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాకుండా ప్రధానోపాధ్యాయురాలికి కూడా ఫిర్యాదు చేశారు. ఆమె స్పందించకపోవటంతో విద్యార్థుల తల్లిదండ్రులు నేరుగా పాఠశాల వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. సంబంధిత ఉపాధ్యాయుడిని సస్పెండ్​ చేయాలని డిమాండ్​ చేశారు. ప్రధానోపాధ్యాయురాలు స్పందిస్తూ.. విచారణ కమిటీని ఏర్పాటు చేసి విచారిస్తున్నామని వివరించారు. ఇటువంటి ఉపాధ్యాయులు ఉంటే తమ పిల్లలను పాఠశాలకు ఎలా పంపించాలని ఆవేదన వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details