TDP MLC Panchumurthy Fires on Minister Roja "వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జైల్లో పెట్టారు.. నిజం గెలవాలి యాత్రపై దిగజారి మాడ్లాడుతున్నారు" - ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ కామెంట్స్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 24, 2023, 3:40 PM IST
Panchumurthy Anuradha Comments on Minister Roja వ్యవస్థలను మేనేజ్ చేసి.. చంద్రబాబును అక్రమంగా జైల్లో నిర్బంధించారని, తెలుగుదేశం ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజం గెలవాలి యాత్రపై మంత్రి రోజా దిగజారి మాడ్లాడటం దారుణమన్నారు. తిరుమలలో రోజా వ్యాఖ్యలు ఖండించారు. రోజా వందల కోట్లు ఎలా సంపాదించారో సీబీఐ విచారణ కోరే ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు. 16 కార్లు, నాలుగు పెట్రోల్ బంక్‌లు ఎలా వచ్చాయో సీబీఐ విచారణ కోరాలని అనురాధ డిమాండ్ చేశారు. గత 11 సంవత్సరాలుగా బయట తిరుగుతున్న జగన్ పై సీబీఐ ఎంక్వైరీ వేయాలని కోరగలరా అంటూ సవాల్ విసిరారు. మంత్రి రోజాపై ఎస్సీ, ఎస్టీ అసైన్డ్ భూములను వ్యవహారంలో అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. గత నలభై ఐదు రోజులుగా చంద్రబాబును అక్రమంగా జైల్లో బందీంచారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు మద్దతుగా 107 దేశాల్లో ఆందోళన వ్యక్తం చేస్తూన్నారని ఆరోపించారు. మెుదట 3వేల కోట్ల స్కాం అన్న వైసీపీ నేడు 27 కోట్ల స్కాం అంటుందని, ఎమ్మెల్సీ అనురాధ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.