వారి వల్లే ఎమ్మెల్సీగా విజయం సాధించా..: పంచుమర్తి అనురాధ
PANCHUMARTHI ANURADHA INTERVIEW : అధికార వైసీపీకు షాక్ ఇస్తూ.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ అనూహ్యంగా విజయం సాధించారు. ఈ విజయం టీడీపీ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపింది. మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను అధికార పార్టీ జీర్ణించుకోకముందే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలుపుతో మరోసారి దెబ్బ తగిలిందనే చెప్పవచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన పంచుమర్తి అనురాధ.. రాజకీయ ప్రయాణం ఒక సంచలనమే. అనుకోకుండా రాజకీయాల్లో వచ్చి అతి పిన్న వయసులోనే విజయవాడ మేయర్‌గా తనదైన ముద్రవేశారు.
అయితే అధినేతచంద్రబాబు, నారా లోకేశ్ సపోర్ట్‌తోనే తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచినట్లు పంచుమర్తి అనురాధ తెలిపారు. పార్టీ కోసం చాలా ఏళ్లు కష్టపడ్డానని.. క్యాన్సర్‌ను సైతం జయించినట్లు తెలిపారు. తనకు క్యాన్సర్ వచ్చినప్పుడు చంద్రబాబు, లోకేశ్, భువనేశ్వరి, పార్టీ అంతా అండగా నిలిచిందని గుర్తు చేశారు. పార్టీ అండతోనే ఆనాడు క్యాన్సర్‌ని జయించి.. నేడు ఎమ్మెల్సీగా విజయం సాధించానని అనురాధ స్పష్టం చేశారు.
అలాగే పదవులతో సంబంధం లేకుండా పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని అనురాధ స్పష్టం చేశారు. తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీగా గెలుపొందిన పంచుమర్తి అనురాధతో మా ప్రతినిధి ప్రత్యేక ముఖాముఖి..