'ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంటోంది - జగన్కు కేంద్రం సహకరిస్తోంది' - వైఎస్సార్ ప్రభుత్వం పై రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 25, 2023, 3:56 PM IST
Panchayat Raj Chamber State President Rajendra Prasad Fires on YSRCP, Central Finance Minister :పంచాయతీలకు రావాల్సిన ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లించడంలో కేంద్ర ప్రమేయం కూడా ఉందని పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులను ఇవ్వకపోగా కేంద్రం నుంచి వస్తున్న నిధులను సైతం సీఎం జగన్ తన సొంత ప్రయోజనాలు, పథకాల కోసం వాడుతున్నారని రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. దీంతో గ్రామాల అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Panchayat Raj Chamber Chief YVB Rajendra Prasad :నిధుల దుర్వినియోగంపై కేంద్ర బృందం పర్యటించి నివేదికను సిద్ధం చేసి మూడు నెలలు కావస్తున్నా ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. ఉపాధి హామీలో దొంగ హాజర్లు వేసుకుని అడ్డగోలుగా కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అక్రమ దోపిడీకి కేంద్ర ఆర్థిక శాక మంత్రి సహాయ సహకారాలు ఉన్నాయని రాజేంద్రప్రసాద్ ఆరోపించారు.