Panchakarla Ramesh Babu: ఈనెల 20న జనసేనలో చేరనున్న పంచకర్ల రమేశ్ బాబు.. - Panchakarla Ramesh Babu press meet
Panchakarla Ramesh Babu Joins janasena: ఇటీవల వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు రేపు జనసేన పార్టీలో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. గురువారం విజయవాడలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్రాభివృద్ధిని కాక్షించే పవన్ నాయకత్వంలో నడవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆత్మగౌరవం దెబ్బతినడంతోనే వైఎస్సార్సీపీ నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు. పెందుర్తి టిక్కెట్ పై హామీ ఏమి లేదని.. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో పనిచేస్తానని అన్నారు.
"ఆత్మగౌరవం దెబ్బతినడంతోనే వైఎస్సార్సీపీ నుంచి నేను బయటకు వచ్చాను. రాష్ట్రాభివృద్ధిని కాక్షించే పవన్ నాయకత్వంలో నడవాలని నిర్ణయం తీసుకున్నాను. గురువారం విజయవాడలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నాను. పెందుర్తి టిక్కెట్‌పై హామీ ఏమి లేదు.. కానీ పార్టీ ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో పనిచేస్తాను." - పంచకర్ల రమేశ్ బాబు , మాజీ ఎమ్మెల్యే