ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

pamphlets in Tadipatri: తాడిపత్రిలో మరోసారి కరపత్రాల కలకలం.. ఈసారి ఏకంగా..! - ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పాదయాత్ర

🎬 Watch Now: Feature Video

Pamplets Viral in Tadipatri

By

Published : May 29, 2023, 5:31 PM IST

pamphlets Viral in Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో కరపత్రాలు కలకలం సృష్టించాయి. స్థానిక వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పాదయాత్ర ముగింపు సభ ఏర్పాటు చేస్తున్న సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తులు పట్టణంలోని వీధుల్లో కరపత్రాలు వేశారు. అందులో ఎమ్మెల్యే పట్టణ ప్రజలకు అభివృద్ధి చేసిందేమీ లేదని విమర్శిస్తూ కరపత్రంలో ముద్రించారు. అలాగే తెలుగుదేశం పార్టీ నేతల కుటుంబాన్ని విమర్శించకుంటే ఎమ్మెల్యేకు నిద్ర పట్టదని అందులో పేర్కొన్నారు. పాదయాత్రను పది రోజులు ఆలస్యంగా ఎందుకు ప్రారంభించారో చెప్పాలని ప్రశ్నించారు. తాడిపత్రి పట్టణంలో అభివృద్ధి చేసిందేమీ లేదని పేర్కొన్నారు. వీధి వీధి నా హృదయం కరపత్రాలు దర్శనమివ్వడంతో.. స్థానిక ప్రజలు వాటిని చదువుతున్నారు. తాడిపత్రి పట్టణంలో ఈ మధ్య కాలంలోనే కరపత్రాలు కలకలం సృష్టిస్తున్న ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. కరపత్రాలు వేస్తున్నది మాత్రం ఎవరనేది పోలీసులు గుర్తించలేకపోతున్నారు. తాజాగా మరోసారి కరపత్రాలు వెలుగు చూడటంతో ఈ విషయం చర్చనీయాంశమైంది.

ABOUT THE AUTHOR

...view details