జగన్ సైకో పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు : టీడీపీ నేత జీవీ ఆంజనేయులు - Gv Anjaneyulu criticized jagan
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 27, 2023, 11:10 AM IST
Palnadu District TDP President Criticized CM Jagan : రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్ని వర్గాలను నమ్మించి మోసం చేశారని పల్నాడు జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు విమర్శించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి రైతులకు, అంగన్వాడీలకు, దళితులకు సీఎం అన్యాయం చేశారని దుయ్యబట్టారు. జగన్ సైకో పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జగన్ విషయంలో విశ్వసనీయత అంటే మోసం, నయవంచన అన్నారు. మోసం చేయడం జగన్‌కు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ లేదు, దళితులు, ఎస్టీలు, మైనార్టీలు, బీసీలను నిలువునా ముంచారని తెలిపారు. సబ్‌ప్లాన్ నిధుల మళ్లింపు వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
అమరావతి రాజధానిని పరుగులు పెట్టిస్తా అని ఎన్నికల ముందు భరోసా ఇచ్చి తర్వాత మాట తప్పి, మడమ తిప్పి వేల ఎకరాలు ఇచ్చిన రైతులను మోసం చేయడం నిజం కాదా అన్నారు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మద్యం మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి రుణం తెచ్చావంటే నిన్ను మించిన ఘనులు ఇంకేవరూ లేరన్నారు. నీవల్ల నష్టపోని వర్గాలు ఉంటే చెప్పాలని ప్రశ్నించారు. వినుకొండ మండలం దాట్లవారిపాలెం గ్రామానికి చెందిన ఎస్సీ కుటుంబాలు ఆంజనేయుల సమక్షంలో టీడీపీలోకి చేరారు. అనంతరం పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.