ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Owner_ Protested_ by_ Locking_ The_ Village_ Secretariat

ETV Bharat / videos

Owner Locked Village Secretariat Office అద్దె చెల్లించడం లేదని.. గ్రామ సచివాలయ కార్యాలయానికి తాళం వేసిన భవన యజమాని - telugu latest news

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 5, 2023, 8:33 AM IST

Owner Locked Village Secretariat Officeపల్నాడు జిల్లా ఓ సచివాలయానికి తాళం దర్శనమిచ్చింది. ఏడు నెలల నుంచి అద్దె చెల్లించకపోవడంతో భవన యజమాని గ్రామ సచివాలయం భవనానికి తాళం వేశారు. భవన యజమాని శివ తెలిపిన వివరాల మేరకు.. అద్దె చెల్లించకపోవడంతో గ్రామ సచివాలయ భవనానికి యజమాని తాళం వేసి నిరసన తెలిపిన ఘటన పల్నాడు జిల్లా అమరావతిలో చోటుచేసుకుంది. గ్రామంలో సచివాలయం-2 నిర్వహణకు నెలకు 8వేల 500 అద్దె చెల్లించేలా అధికారులు భవన యజమాని శివతో ఒప్పందం చేసుకున్నారు. ఐతే 7 నెలలుగా అద్దె చెల్లించడం లేదని.. అధికారులు, కార్యాలయాలు, ఎంపీడీవో, పంచాయతీ కార్యాలయల చుట్టూ ఏడు నెలలుగా తిరిగినా స్పందన రాలేదన్నారు. దీంతో గాంధీ జయంతి రోజున సచివాలయ భవనానికి తాళం వేసి యజమాని నిరసన తెలిపారు. కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే లబ్ధిదారులు తాళం వేసి ఉండటాన్ని చూసి నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఈ విషయమై ఎంపీడీఓ మాధురిని వివరణ కోరగా అద్దె చెల్లించకపోవడంతో యజమాని తాళం వేశారని, కొత్త సచివాలయ భవనం త్వరలోనే సిద్ధమవుతుందని, ఈలోగా సిబ్బంది పనిచేయడానికి ప్రత్యామ్నాయం చూస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details