ఆంధ్రప్రదేశ్

andhra pradesh

out_sourcing_employees_pen_down_programme_in_satya_sai_district

ETV Bharat / videos

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పెన్​డౌన్ - ఇచ్చిన మాటను జగన్​ నిలబెట్టుకోవాలని డిమాండ్ - ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగుల నిరసన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 16, 2023, 5:25 PM IST

Updated : Dec 16, 2023, 5:32 PM IST

Out Sourcing Employees Pen Down Programme in Satya Sai District: శ్రీ సత్యసాయి జిల్లాలోని విద్యాశాఖలో విధులు నిర్వహిస్తున్న ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగులు పెన్​డౌన్​ చేపట్టారు. సమానపనికి సమాన వేతనం కల్పించాలని, ​ఉద్యోగ భద్రత వంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగుల​ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి మాట్లాడుతూ విద్యాశాఖలో రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్నామని వివరించారు. అయినప్పటికి ఇంతవరకు ఉద్యోగ భద్రత కరవైందని, సమాన పనికి సమాన వేతనం లేవని ఆవేదన వ్యక్తం చేశారు. 

జగన్​ అధికారంలోకి రాకముందు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఉద్యోగ భద్రత కల్పిస్తామనే హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం పట్టించుకోవడం లేదని వాపోయారు. వారి న్యాయమైన డిమాండ్లను నేరవేర్చకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరో నేత ఓబులేశు మాట్లాడుతూ జగన్​ను నమ్మి అధికారం చేతికి ఇచ్చామని ఇప్పటికైనా, తమ మొర ఆలకించి పాదయాత్రలో ఇచ్చిన హామీలను నేరవేర్చాలని డిమాండ్​ చేశారు. రెగ్యులర్​ ఉద్యోగులకు సమానంగా తమ అర్హతలు ఉన్నాయని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. 

Last Updated : Dec 16, 2023, 5:32 PM IST

ABOUT THE AUTHOR

...view details