ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Forest Dept Six Cages Were Brought from Maharashtra

ETV Bharat / videos

Operation Chirutha in Tirumala: తిరుమలలో కొనసాగుతున్న చిరుతల వేట.. మహారాష్ట్ర నుంచి ఆరు బోన్లు - చిరుతను బంధించిన అధికారులు

By

Published : Aug 18, 2023, 6:14 PM IST

Forest Dept Six Cages Were Brought from Maharashtra: తిరుమల కాలిబాట అటవీ ప్రాంతంలో ఆపరేషన్ చిరుత కార్యక్రమం  ఇంకా  కొనసాగుతోంది. అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గంలో తిరుమలకు వచ్చే భక్తుల రక్షణకు చర్యలు టీటీడీ చేపడుతోంది. ఇప్పటికే మూడు, ఏడో మైలు నుంచి నరసింహ ఆలయం వరకు అటవీ శాఖ అధికారులు మూడు చిరుతలను (leopard) బోనులో బంధించారు.  మరిన్ని చిరుతలను బంధించి తరలించేందుకు సిద్దమైనట్లు తెలిపారు. లక్షితపై దాడి అనంతరం నరసింహ ఆలయం సమీప అటవీ ప్రాంతంలో సుమారు నాలుగు బోనుల ద్వారా చిరుతలను పట్టుకున్నారు. చిరుతలను పట్టుకునేందుకు మహారాష్ట్ర (Maharashtra) నుంచి సుమారు ఆరు బోనులను తెప్పించారు. వీటిని నరసింహ ఆలయ అటవీ ప్రాంతంలోనే అధికారులు పెట్టనున్నారు. అయితే, తిరుమల కొండపైకి కాలినడకన వచ్చే భక్తులకు చేతి కర్ర ఇస్తామని.. తితిదే అధికారులు చెప్పడంతో  భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే..  తిరుపతిలో జరుగుతున్న వరుస ఘటనలతో భక్తుల్లోఆందోళన నెలకొన్న వేళ.. తిరుమల తిరుపతి దేవస్థానం భద్రతా పరమైన చర్యలకు ఉపక్రమించింది. 

ABOUT THE AUTHOR

...view details