ఆంధ్రప్రదేశ్

andhra pradesh

open_art_program

ETV Bharat / videos

ప్రకృతి రమణీయత, వన్యప్రాణుల బొమ్మలతో చిత్రకారుల నైపుణ్యాలు - అలరించిన ఓపెన్​ఆర్ట్ - latest news prakasam district

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 18, 2023, 2:28 PM IST

Open Art Program in prakasam district :ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట నల్లమల ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు ఓపెన్​ ఆర్ట్​ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు చిత్రకారులు పాల్లొని ప్రకృతి, వన్యప్రాణుల చిత్రాలను గీశారు. ఈ ఓపెన్​ ఆర్ట్​ కార్యక్రమానికి చిన్న పిల్లలు కూడా పాల్లొని తన ప్రతిభను ప్రదర్శించారు.

Painters Participating in The Open Art Program : అటవీ శాఖ అధికారి ఓపెన్​ ఆర్ట్​ కార్యక్రమ విశేషాలను తెలిపారు. అటవీ వన్యప్రాణుల, ప్రకృతి రమణీయతను ప్రదర్శించే విధంగా చిత్రకారుల నైపుణ్యాలు ఉన్నాయని కొనియాడారు. ప్లాస్టిక్​పై అవగాహన​ కల్పిస్తూ క్లాత్​ పై చిత్రకారులు బొమ్మలను గీశారని తెలిపారు. ప్రకృతి వన్యప్రాణులను ఉద్దేశించి బొమ్మలు గీసేందుకు ప్రకాశం జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పలువురు చిత్రకారులు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు. ఓపెన్​ ఆర్ట్​ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఉన్నత అధికారులు సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details