నూతన సంవత్సర వేడుకల్లో ఇరువర్గాల మద్య ఘర్షణ, ఒకరు మృతి - political news nandhyala
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 1, 2024, 4:14 PM IST
One Person Died Due to Old Factions :నంద్యాల జిల్లాలో పాత కక్షలు భగ్గుమన్నాయి. డోన్ మండలం ఉంగరానిగుండ్లలో పాతకక్షలతో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. నూతన సంవత్సర వేడుకలను చేసుకోవడానికి లక్ష్మీనారాయణ కుమారుడు కావలి ఖాదర్ స్వగ్రామానికి వచ్చారు. వైసీపీకి చెందిన చిన్నమద్ది కుమారుడు ఓబులేష్ పాతకక్షల నేపథ్యంలో ఖాదర్‌పై దాడి చేశారు. అనంతరం ఖాదర్ ఇంటికి వెళ్లి కర్రలతో కొట్టారు. ఈ దాడిలో ఖాదర్ మృతి చెందారు.
Khader Died in Nandhyala District : వైసీపీ వర్గానికి చేసిన దాడిలో ఖాదర్ మరణించగా, అతని సమీప బంధువులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మృతుని బంధువులు డోన్ గ్రామీణ పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. పోలీసులు స్పందిచకపోవడం వల్ల జాతీయ రహదారిపై రెండు గంటల పాటు బైఠాయించారు. డీఎస్పీ శ్రీనివాస రెడ్డి జోక్యం చేసుకుని బాధితులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అన్యాయంగా ఖాదర్‌పై దాడి చేశారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు కార్ల అద్దాలను ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పిల్లలకు దిక్కెవరని ఖాదర్ భార్య, బంధువులు బోరున విలపిస్తున్నారు.