ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Old_Women_Crying_On_Chandrababu_Arrest

ETV Bharat / videos

Old Women Crying on Chandrababu Arrest: 'చంద్రబాబు తప్పు చేయడు.. ఆయన బయటకు రావాలి..' కన్నీటి పర్యంతమైన వృద్ధురాలు - చంద్రబాబు అరెస్ట్​పై కన్నీరు పెట్టుకున్న మహిళలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 5, 2023, 3:44 PM IST

Old Women Crying on Chandrababu Arrest :మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో (AP Skill Development Case) అరెస్టైన విషయం అందరీకీ తెలిసిందే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గల్లీ నుంచి ఢిల్లీ దాకా రాజకీయ పార్టీలకు అతీతంగా చంద్రబాబు అరెస్టు అక్రమం అంటూ తమ గళాన్ని ప్రపంచానికి వినిపిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలు వివిధ నిరసన రూపాల్లో వారి గళాన్ని ప్రభుత్వానికి వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఓ వృద్ధురాలు నారా భువనేశ్వరిని కలిసి కన్నీరు పెట్టుకున్నారు.

Old Women Emotional on CBN Arrest :తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ రాజమహేంద్రవరంలో ఓ స్థానిక వృద్ధురాలు నారా భువనేశ్వరిని కలిసి (Old Women Met Nara Bhuvaneswari) సంఘీభావం తెలిపారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబును అరెస్టు చేసినప్పటి నుంచీ అన్నం కూడా తినడం లేదని అన్నారు. వృద్ధాప్యంలో ఉన్నందున ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనలేక పోతున్నానని కన్నీటి పర్యంతమయ్యారు.

ABOUT THE AUTHOR

...view details