ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Old_Woman_Died_Due_to_Electric_Shock

ETV Bharat / videos

Old Woman Died Due to Electric Shock: విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం.. వృద్ధురాలు మృతి - Accident news

By

Published : Aug 14, 2023, 1:28 PM IST

Old Woman Died Due to Electric Shock:కర్నూలు జిల్లా అదోనిలో విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యంతో వృద్ధురాలు మృతి చెందింది. లంగర్ బావి వీధిలో ఇంటి ముందు విద్యుత్​ వైర్లు తెగిపడ్డాయి.  అవి అయ్యమ్మ అనే వృద్దురాలికి తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అయ్యమ్మ కాయగూరలు కొనడానికి బయటకు వచ్చింది. అదే సమయంలో కరెంటు తీగ అయ్యమ్మ మీద పడి మృతి చెందిందని స్థానికులు తెలిపారు. ఆ వీధిలో కరెంటు వైర్లు ప్రమాదకరంగా ఉన్నాయని.. అవి తెగి కింద పడుతున్నాయని చాలా సార్లు ఫిర్యాదు చేసినా అధికారుల నుంచి స్పందన లేదని స్థానికులు తెలిపారు. అప్పుడప్పుడు లైన్​మెన్​ వచ్చి వాటికి అరకొరగా మరమ్మతులు చేసి వెళ్తున్నారే కానీ పూర్తిగా చేయట్లేదు. రోడ్లు మీద పిల్లలు తిరుగుతుంటారు.. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఏవరు బాధ్యత వహిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఇలా ఎన్ని ప్రాణాలు పోతే ఎలక్ట్రిక్ డిపార్ట్​మెంట్​ అధికారులు స్పందిస్తారని స్థానికులు వాపోతున్నారు. వృద్దురాలి మృతితో వారి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.

ABOUT THE AUTHOR

...view details