జమ్మలమడుగు వద్ద తెగిన పాత వంతెన రోడ్డు.. 16 గ్రామాలకు సంబంధాలు కట్ - వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు
BRIDGE BROKEN : ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు వద్ద పాతవంతెన రోడ్డు తెగిపోయింది. దాంతో జమ్మలమడుగు నుంచి ముద్దనూరుకు రాకపోకలు నిలిచాయి. వంతెన తెగడంతో సుమారు 16 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. పెన్నా వంతెన వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. గతేడాదే స్పందించి ఉంటే హై లెవెల్ వంతెన పూర్తి అయ్యేదని పలువురు సూచిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు మళ్లీ రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉండడం దారుణమని వాపోతున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST