ఓ వైపు సభ ఏర్పాట్లు - మరో వైపు టీడీపీ ఫ్లెక్సీలను, జెండాలను తొలగించిన సిబ్బంది - gajuvaka update news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 20, 2023, 3:58 PM IST
Officials Removed TDP Flags : తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 'యువగళం' పాదయాత్ర విజయోత్సవ సభను పురస్కరించుకొని గాజువాకలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, జెండాలను అధికారులు తొలగించే ప్రయత్నం చేశారు వాటిని తొలగిస్తున్న సిబ్బందిపై తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ నేత రాష్ట్ర కార్యదర్శి పుచ్చా విజయకుమార్ మండిపడ్డారు. రాష్ట్రస్థాయిలో ఒక సభ నిర్వహిస్తుంటే జెండాలను, ఫ్లెక్సీలను తొలగించి ఏం చేయదలుచుకున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ సైకో తరహా పనులను మానుకోకపోతే ప్రజలు తప్పనిసరిగా బుద్ధి చెబుతారని అన్నారు.
TDP Leader was Angry With The Staff : తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి సైకో పనులు చేయలేదని విజయకుమార్ పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇంకా ఎన్నికలు రావడానికి మూడు నెలల సమయం మాత్రమే ఉందని గుర్తు చేశారు. అధికారులు జెండాలను, ఫ్లెక్సీలను తొలగించేందుకు ఆదేశాలు ఎలా జారీ చేశారని ప్రశ్నించారు.