ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Nursing_Student_Attempt_Suicide_Due_to_Ragging

ETV Bharat / videos

Nursing Student Suicide Attempt Due to Ragging in Eluru: నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. సీనియర్ల వేధింపులే కారణమా..? - ఏలూరు ర్యాగింగ్ సూసైడ్ వార్త

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 29, 2023, 4:10 PM IST

Nursing Student Suicide Attempt Due to Ragging in Eluru: ఏలూరు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేగింది. సీనియర్ల వేధింపులు తట్టుకోలేక ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఏలూరు సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ జిఎన్​ఎమ్ నర్సింగ్ కళాళాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సీనియర్లు వేధిస్తున్నారని.. అధిక మోతాదులో మాత్రలు తీసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే బాధితురాలిని చిక్సిత కోసం ఆసుపత్రికి తరలించారు. 

కడుపు నొప్పి తాళలేకే నర్సింగ్ విద్యార్థిని అధిక మొత్తంలో మాత్రలు మింగిందని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ అన్నారు. ప్రస్తుతానికి విద్యార్థిని పరిస్థితి నిలకడగా ఉందని.. చిక్సిత అందిస్తున్నట్లు తెలిపారు. ఇంతవరకు ర్యాగింగ్ విషయం తమ దృష్టికి రాలేదని అని వివరించారు. అలాంటిది ఏమైనా ఉంటే విచారణ జరిపి.. బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యార్థిని కొలుకున్నాక పూర్తి వివరాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులకు ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయని.. పరీక్షల ఒత్తిడి, కడుపు నొప్పి కారణంగానే అధిక మోతాదులో మాత్రలు తీసుకొని ఉండొచ్చని సూపరింటెండెంట్ వివరించారు. 

ABOUT THE AUTHOR

...view details