ఎన్టీఆర్ అభిమానుల జోష్.. కొండారెడ్డి బురుజు వద్ద 'నాటు నాటు'కు స్టెప్పులు - NTR fans dance at Konda Reddy Fort
NTR Fans Dance at Konda Reddy Fort: అంతర్జాతీయ స్థాయిలో తెలుగు చిత్ర ఖ్యాతిని చాటిన 'నాటు నాటు' పాట.. ఆస్కార్‌కు అడుగు దూరంలో ఉంది. దీంతో కేవలం సినీ అభిమానులు మాత్రమే కాకుండా ప్రతి భారతీయుడు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం.. ఆస్కార్ కూడా అందుకోవాలని కోట్లాది మంది సినీ ప్రేమికులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. దీంతో కర్నూలులో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సందడి చేశారు. నాటు నాటు పాట ఆస్కార్‌కు నామినేట్ అవ్వడం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డు రావాలని కోరుకున్నారు. కర్నూలు నగరంలోని కొండారెడ్డి బురుజు వద్ద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు డాన్స్ చేసి తమ హీరోకు కృతజ్ఞతలు తెలిపారు. చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించిన చిత్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళికి ధన్యవాదాలు తెలియజేశారు. నాటు నాటు పాటకు కచ్చితంగా ఆస్కార్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.