NTR centenary celebrations: సింగపూర్‌లో ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు.. ముఖ్య అతిథిగా పయ్యావుల - Payyavula Keshav comments on NTR
NTR centenary celebrations in Singapore: నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాలను తెలుగుదేశం నేతలు, అభిమానులు వాడవాడలా వైభవంగా నిర్వహిస్తున్నారు. కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచంలో తెలుగు వారు ఉన్న ప్రతీ చోటా ఎక్కడికక్కడ ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహించి ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. సింగపూర్‌లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.. తెలుగుదేశం సింగపూర్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన.. ఈ వేడుకలకి తెలుగుదేశం నేత పయ్యావుల కేశవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. తెలుగు సమాజాన్ని ప్రజాస్వామికం విప్లవం వైపు నడిపించిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు 100 దేశాల్లో జరుగుతున్నాయని కేశవ్ తెలిపారు. తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మహోన్నత వ్యక్తి, సంక్షేమానికి ఆద్యుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ అనే పిలుపే ఆ రోజుల్లో ఒక ప్రభంజనం.. ఆయన ఇచ్చినటువంటి పిలుపు తెలుగుదేశం పిలుస్తుంది కదిలిరా అనే పిలుపుకి సమాజం ఈ సమాజం మొత్తం కదిలిందని అన్నారు.