ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు

ETV Bharat / videos

ఆస్ట్రేలియాలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు.. పాల్గొన్న బాలకృష్ణ సతీమణి, కుమార్తె - బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని

By

Published : May 30, 2023, 10:41 PM IST

Updated : May 31, 2023, 6:23 AM IST

NTR 100 years celebrations: విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ప్రపంచ వ్యప్తంగా వివిధ దేశాల్లో ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో నేడు దక్షిణ ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో నందమూరి కుంటుబసభ్యుల సమక్షంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ ఎన్​ఆర్ఐ సెల్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్​కు నివాళులర్పించారు. 

 ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి, బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని హాజరయ్యారు. టీడీపీ అడిలైడ్‌ వారు ప్రత్యేకంగా రూపొందించిన మ్యాగజైన్‌ను కమిటీ సభ్యులతో కలిసి తేజస్విని ఆవిష్కరించారు. తెలుగుదేశం ఎన్​ఆర్ఐ అడిలైడ్‌ సెల్‌ వారిచే ప్రత్యేకంగా తయారు చేయించిన 6గ్రాముల వెండి నాణాన్ని వసుంధర దేవి రిలీజ్‌ చేశారు. అభిమానుల కోరిక మేరకు వసుంధర దేవి బాలకృష్ణకు వీడియో కాల్‌ చేయగా బాలకృష్ణ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఎన్టీఆర్  జీవిత ముఖ్య విశేషాలతో ఏర్పాటు చేసిన గ్యాలరీ చూపరులనుఆకట్టుకుంది

Last Updated : May 31, 2023, 6:23 AM IST

ABOUT THE AUTHOR

...view details