ఆంధ్రప్రదేశ్

andhra pradesh

NRIs_agitation_against_CBN_Arrest

ETV Bharat / videos

NRIs agitation against CBN Arrest: చంద్రబాబు అరెస్టుపై ఎన్​ఆర్​ఐల ఆగ్రహం.. టాంజానియాలో క్యాండిల్ ర్యాలీలు.. - టాంజానియాలో క్యాండిల్ ర్యాలీలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 23, 2023, 4:55 PM IST

NRIs agitation against CBN Arrest: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ ఎక్కడిక్కడ నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు ఆయురారోగ్యాలతో జైలు నుంచి వెంటనే విడుదల కావాలని ఆకాంక్షిస్తూ.. ఆలయాల్లో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా నిరసనలు, రాస్తారోకోలు, రిలే దీక్షలు, ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో వివిధ దేశాల్లో ఉన్న తెలుగు ప్రజల నుంచి చంద్రబాబు అరెస్టుపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబును జైలు నుంచి విడుదల చేసేంత వరకు ఆందోళనలు విరమించేదే లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టాంజానియా దేశంలో ప్రవాసాంధ్రులు నిరసన తెలిపారు. రాజధాని దార్‌ ఎస్‌ సలాంలో తెలుగువారు క్యాండిల్‌ ర్యాలీ చేశారు. రాజకీయ కక్షతోనే చంద్రబాబును అక్రమంగా ఇరికించారని ఎన్ఆర్​ఐలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. 'వియ్‌ స్టాండ్‌ విత్‌ బాబు' అంటూ క్యాండిల్‌ ర్యాలీలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details