ఆంధ్రప్రదేశ్

andhra pradesh

NRIs_ Protests_ Against_ Chandrababu_ Arrest

ETV Bharat / videos

NRIs Protests Against Chandrababu Arrest : చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ అమెరికాలో ఎన్నారైల ఆందోళనలు - NRI Community Protests Against Chandrababu Arrest

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 26, 2023, 9:07 AM IST

NRIs Protests Against Chandrababu Arrest : చంద్రబాబు అరెస్టును ప్రవాసులంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. అభివృద్ధి ప్రదాతను అక్రమంగా జైల్లో పెట్టడం దారుణమని మండిపడుతున్నారు. ఆయనకు సంఘీభావంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అరాచక పాలన సాగిస్తున్న జగన్‌కు ఓటుతో బుద్ధి చెప్పాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రవాసులు ప్రజలకు పిలుపునిస్తున్నారు.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టు ఖండిస్తూ అమెరికాలోని మీయావాకీ, విస్కన్సన్‌, బ్లూమింగ్టన్,నార్మల్​లో ఎన్నారైలు నిరసన వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్య విలువలను పక్కనపెట్టి, రాజకీయ వ్యవస్థలో ముఖ్యమైన విపక్షాలను మట్టుపెట్టే దిశగా ఆంధ్ర పాలకుల వ్యవహారశైలిని ఖండించారు. నాలుగున్నర దశాబ్దాల మచ్చలేని రాజకీయ నాయకుడు, చంద్రబాబు పై జరుగుతున్న అప్రజాస్వామిక దాడికి నిరసనగా బ్లూమింగ్టన్, నార్మల్ ఇల్లినాయిస్​లో చంద్రబాబు అభిమానులు క్లియర్ వాటర్ పార్క్ వద్ద సమావేశమై సంఘీభావం తెలిపారు. అప్రజాస్వామిక దాడికి నిరసనగా అమెరికాలోని శాన్ డియాగో, కాలిఫోర్నియా ఎన్నారైలు అద్భుతమైన రీతిలో మానవహారం నిర్మించి తమ నిరసన తెలిపారు. ప్రభుత్వం ప్రతిపక్షాలపై కక్ష తీర్చుకుంటోందని ఎన్నారైలు తెలిపారు. అవినీతి మచ్చలేని చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం బురదచల్లుతోందని ఎన్నారైలు ఆరోపించారు. ప్లకార్డులు చేతబట్టి ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. కేవలం ప్రభుత్వం కక్షసాధింపు చర్యల్లో భాగంగానే అరెస్ట్ చేశారని ఎన్నారైలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details