No School For Adivasi Childrens: బడికి వెళ్లాలంటే రోజు 8 కిలోమీటర్లు నడవాల్సిందే..!
No School For Adivasi Childrens in Anakapalli District : వేసవి సెలవులు ముగిశాయి. జూన్ నెల వచ్చింది. బడి గంట మోగింది. పాఠశాలలు తలుపులు తెరుచుకున్నాయి. పిల్లలంతా బ్యాగులు పట్టుకోని బుడి బుడి నడకలతో బడి బాడ పడుతున్నారు. కానీ ఆ పిల్లలు ఉండే ఊరు మండల కేంద్రానికి కేంద్రానికి దూరంగా విసిరేసినట్లుగా ఉంటుంది. ఫలితంగా వారు బడికి వెళ్లాలంటే ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తోంది. వారి సమస్యలను అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నివించుకున్నా పట్టించుకునే నాధుడే లేడు. తాము చదువుకోవడానికి పాఠశాల నిర్మించి.. కష్టాల కడలి నుంచి గట్టెక్కించాలని పిల్లలు వేడుకుంటున్నారు.
అనకాపల్లి జిల్లా కోటఉరట్ల మండలంలోని గొట్టివాడు పంచాయతీ శివారులో ఆణకు గిరిజనులు, ఆదివాసీలు నివసిస్తుంటారు. ఇక్కడ 80 కుటుంబాలు ఏళ్ల తరబడి పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవితాన్ని సాగిస్తున్నారు. తమ గ్రామంలో పాఠశాల లేదని, పిల్లలు పాఠశాలకు వెళ్లాలంటే సుమారు ఎనిమిది కిలోమీటర్లు కాలినడన వెళ్లాల్సి వస్తోందని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో 40 మందికి పైగా పిల్లలు ఉన్నారని, పాఠశాల నిర్మించాలని పలుమార్లు ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్న పట్టించులేదని వాపోయారు. ఇప్పటికైనా స్పందించి పాఠశాల నిర్మించాలని ఆదివాసీలు కోరుతున్నారు.