ఆంధ్రప్రదేశ్

andhra pradesh

nimmagadda_ramesh_kumar

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 7, 2024, 3:40 PM IST

ETV Bharat / videos

ఓట్ల అక్రమాలు ఈసీకి చేరకుండా అజ్ఞాత శక్తులు అడ్డుకుంటున్నాయి : నిమ్మగడ్డ

Nimmagadda Ramesh Kumar about Irregularities in Voters List: దేశవ్యాప్తంగా ఎన్నికలను సజావుగా నిర్వహిస్తున్న కేంద్ర ఎన్నికల కమిషన్ ఏపీలో ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తోందని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రధాన కార్యాదర్శి నిమ్మగ‌డ్డ రమేష్ కుమార్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్​లో జరుగుతున్న ఓట్ల అవకతకలపై ఎందుకు దృష్టి సారించట్లేదని నిలదీశారు. ఓట్ల అక్రమాలు ఎన్నికల సంఘానికి చేరకుండా అజ్ఞాత శక్తులు అడ్డుకుంటున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఓట్ల జాబితాలో అక్రమాలకు పాల్పడిన ఏ ఒక్క అధికారిపై చర్యలు తీసుకోలేదని నిమ్మగడ్డ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తెలంగాణలో ఎక్కడా రీపోలింగ్‌, దాడులు జరగలేదని, ఎన్నికలు జరిగాయా అన్న రీతిలో ముగిశాయని అన్నారు. కానీ ఏపీలో మాత్రం అనేక సందేహాలు, అనుమానాలు ఉన్నాయన్నారు. ఓటర్ల జాబితాలో లోపాలు ఉన్నాయనే ఆరోపణలున్నాయని, ఓటరుకు తెలియకుండా ఓటు తొలగించే అధికారం ఎవరికీ లేదని తెలిపారు. ఓటరుకు తెలియకుండా తొలగిస్తే అది కచ్చితంగా నేరమే అవుతుందని, దీనిపై సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రేపు రాష్ట్ర పర్యటనకు వస్తున్న ఎన్నికల అధికారులు ఓట్ల అక్రమాలకు చెక్‌ పెట్టాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details