Kodi Kathi case ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు జడ్జి బదిలీ.. కోడికత్తి కేసు ఈనెల 27కి వాయిదా - NIA court adjourns Kodi Kathi case
కోడికత్తి కేసుపై విజయవాడ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. ప్రస్తుతం విచారణ జరుపుతున్న న్యాయమూర్తి ఆంజనేయ మూర్తి ఇటీవల పదోన్నతి పొందారు. కడప జిల్లా ప్రిన్సిపల్ డిస్ర్టిక్ జడ్జిగా బదిలీ అయ్యారు. నూతన జడ్జి కేసు విచారణ జరుపుతారని.. తదుపరి విచారణను ఈనెల 27కి వాయిదా వేశారు. కోడికత్తి కేసులో తదుపరి దర్యాప్తు జరపాలని, తనకు కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇచ్చి.. అడ్వకేట్ కమిషనర్ ను నియమించి.. ఆయన ఆధ్వర్యంలో సాక్ష్యం నమోదు చేయాలని కోరుతూ ఇటీవల సీఎం జగన్ దాఖలు రెండు వ్యాజ్యాలు దాఖలు చేశారు. పిటీషన్లపై విచారణ జరిపింది. ఇప్పటికే జగన్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. నిందితుని తరపు , ఎన్ ఐఏ తరపు న్యాయవాదులు వాదనలను వినిపించాలి. ప్రస్తుత జడ్జి బదిలీ అవ్వటంతో నూతన జడ్జి ముందు మళ్లీ పూర్తి వినాల్సిన అవసరం ఉంటుంది. దీంతో జగన్ తరపు న్యాయవాది మళ్లీ వాదనలు వినిపించాల్సిన అవసరం ఉంది.