NGO Protest: అర్ధాంతర బదిలీల కౌన్సిలింగ్ వాయిదాపై ఏపీ ఎన్జీవో సంఘం నిరసన..
NGO Protest: వైద్య ఆరోగ్య శాఖ జోన్-4 పరిధిలో అర్ధాంతరంగా బదిలీ కౌన్సిలింగ్ ప్రక్రియను ఒక రోజు వాయిదా వేస్తూ తీసుకున్న అత్యవసర నిర్ణయం అనేక అనుమానాలకు తావిస్తోందని ఏపీ ఎన్జీవో సంఘం నాయకులు ఆరోపించారు. ఈ నెల 19 నుంచి 22 వరకు రాయలసీమ ఎనిమిది జిల్లాల పరిధిలోని ఉద్యోగుల బదిలీ కౌన్సిలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు. కడప ఆర్టి కార్యాలయంలో రేపటి నుంచి బదిలీ కౌన్సిలింగ్ జరగాల్సిన సమయంలో కడప జోన్ 4 ఆర్డీ ఒక సంఘానికి అనుకూలంగా బదిలీ కౌన్సిలింగ్ వాయిదా వేయడంపై ఎన్జీవో సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ఆదివారం సెలవుదినం అయినప్పటికీ ఆర్డీ కార్యాయలం ఎదుట నిరసనలు చేశారు. ఆర్డీ దీనిపై స్పందించి సమాధానం చెప్పాలంటూ.. ఆర్టీ కార్యాయంలోని డీఈని ప్రశ్నించారు. ఓ ఉద్యోగ సంఘం.. బదిలీల ప్రక్రియపై కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో.. ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా బదిలీలు వాయిదా వేయడం వెనుక ముడుపులు చేతులు మారాయని, రికమండేషన్ లెటర్ల కోసమే ఇలా చేస్తున్నారని ఎన్టీవో సంఘ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలో కడప ఆర్టీ పరిధిలో బదిలీలలో జరుగుతున్న అవకతవకలపై ఎన్టీవో రాష్ట్ర నాయకుల ద్వారా ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు.