ఆంధ్రప్రదేశ్

andhra pradesh

new_year_celebrations

ETV Bharat / videos

జగన్ నివాసంలో నూతన సంవత్సర వేడుకలు - సీఎంకు టీటీడీ అర్చకులు వేదాశీర్వచనం - ఏపీ తాజా వార్తలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 1, 2024, 3:53 PM IST

New Year Celebrations at CM Jagan House:తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎం జగన్ కేక్ కట్‌ చేశారు. అధికారులు ముఖ్యమంత్రికి పుష్పగుచ్చాలతో కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలిపారు. జగన్‌కు టీటీడీ అర్చకులు వేదాశీర్వచనం అందించారు. స్వామివారి శేషవస్త్రం, ప్రసాదం, క్యాలెండర్, డైరీని అందించారు. దుర్గగుడి వేదపండితులు వేదమంత్రోచ్చారణతో సీఎం జగన్‌ను ఆశీర్వదించారు. జగన్​తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డి కేక్‌ కట్‌ చేయించారు. సీఎం జగన్​కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Greetings from CM Jagan to Telugu People:2024 నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికి ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరంలో ప్రతి ఇంటా ఆనందాలు, అభివృద్ధి కాంతులు వెల్లివిరియాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలని అభిలషించారు.

ABOUT THE AUTHOR

...view details