ఆంధ్రప్రదేశ్

andhra pradesh

new_gps_system_in_government_transport_vehicles

ETV Bharat / videos

ఇకనుంచి ధాన్యం రవాణా వాహనాలకు జీపీఎస్ విధానం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 21, 2023, 10:35 AM IST

New GPS System In Government Transport Vehicles: ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు ప్రభుత్వం రవాణా వాహనాలకు కొత్తగా జీపీఎస్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు పౌర సరఫరాల సంస్థ ప్రకటించింది. ప్రధానంగా జీపీఎస్ చేసిన వాహనాలకు మిల్లర్ల వివరాలు లాగిన్ కాకపోవడంతో ధాన్యం రవాణాలో సమస్య ఎదురవుతోంది. ఏలూరు జిల్లాలో 2.26 లక్షల ఎకరాల్లో వరి సాగుచేయడంతో 6.78 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచన వేస్తోంది. దాదాపు 5.60 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించడమే లక్ష్యం కాగా.. తొలి విడతలో 3.30 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని నిర్ణయించారు. ధాన్యం సేకరించేందుకు 261 ఆర్బీకేలు ఏర్పాటు చేశారు. ఇది జనరేట్ అయితేనే రైతులకు నగదు ఖాతాల్లో పడుతుంది. దీంతో డ్రైవర్లు ధాన్యం లోడుతో వాహనాలను రహదారుల పక్కన నిలిపి రోజుల తరబడి వేచి ఉంటున్నారు.  మాతోనే పెట్టుబడి పెట్టించి జీపీఎస్ కొనుగోలు చేయించి ఇబ్బందులకు గురి చేయడం ఏంటని లారీ యజమానులు, డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాహనాలను వదిలి ఇంటికి వెళ్తే ధాన్యం బస్తాలు చోరీకి గురైతే తామే బాధ్యత వహించాల్సి వస్తుందని వాపోతున్నారు. మరో పక్క వాతావరణం మార్పులతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details