ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Support for Chandrababu during wedding ceremony

ETV Bharat / videos

New Couple Support to Chandrababu in Wedding Ceremony: బాబు కోసం మేము సైతం అంటూ నిరసన తెలిపిన 'కొత్త జంట' - వైసీపీపై బొక్కా లక్ష్మణ్‌ కామెంట్స్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 19, 2023, 9:15 PM IST

New Couple Support to Chandrababu in Wedding Ceremony: స్కిల్ డెవలప్​మెంట్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబుకు మద్దతుగా... టీడీపీ శ్రేణులు, చంద్రబాబు అభిమానులు వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్నారు. అరెస్ట్ అక్రమం అంటూ కేవలం ఆంధ్రప్రదేశ్​లోనే కాకుండా... వివిధ రాష్ట్రాలు, దేశాల్లో చంద్రబాబు కోసం ఆందోళన కార్యక్రమాలు నిర్విస్తున్నారు. ఐటీ ఉద్యోగులు తాము చంద్రబాబు వల్లే ఈ స్థాయిలో ఉన్నామంటూ ఆయన అరెస్ట్ మెుదలూ ఇప్పటకీ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయా ప్రభుత్వాలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినా.. ప్రయోజనం లేకుండా పోతుంది. 

సినిమా థియేటర్స్, షాపింగ్ మాల్స్, పార్కులు, మెట్రో స్టేషన్లు అంటూ తేడా లేకుండా చంద్రబాబుకు మద్దతుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన తెలుగుయువత కార్యనిర్వాహక కార్యదర్శి బొక్కా లక్ష్మణ్‌.. చంద్రబాబుపై తన అభిమానాన్ని చాటుకున్నారు. తన వివాహ వేడుకలో చంద్రబాబుకు మద్దతుగా బాబుతో మేము అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. మేడికొండూరు మండలం పేరేచర్లలో జరిగిన బొక్కా లక్ష్మణ్​, ప్రభావతి వివాహానికి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌, తెలుగు యువత నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ 'బాబుతో నేను' అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. 

ABOUT THE AUTHOR

...view details