ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Netherlands_Cricketer_Anil_Teja_Nidamanuru_in_Guntur

ETV Bharat / videos

ఎంత దూరంలో ఉన్నా మూలాలు మరచిపోవద్దు - అమ్మమ్మ ఊరిలో నెదర్లాండ్‌ క్రికెటర్‌ అనిల్‌ తేజ - అమ్మమ్మ ఊరిలో క్రికెటర్ తేజ నిడమనూరు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 3, 2023, 10:35 PM IST

Netherlands Cricketer Anil Teja Nidamanuru in Guntur :నెదర్లాండ్ క్రికెటర్ అనిల్ తేజ నిడమనూరు గుంటూరు జిల్లాలో పర్యటించారు. అనిల్ అమ్మమ్మ సొంత గ్రామమైన దుగ్గిరాల మండలం పెదపాలెంలోని బంధువులను కలిశారు. మనం ఎంత దూరంలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, మన మూలాలు మరిచిపోకూడదని అనిల్ తేజ అన్నారు. బంధువులతో ఉన్నప్పుడు కలిగే ఆనందం ఎంతో గొప్పగా ఉంటుందని తెలిపారు. తాను ఉద్యోగరీత్యా నెదర్లాండ్ వెళ్లినా చివరికి ఇక్కడే కదా ఉండాల్సింది అని తేజ చెప్పారు. చుట్టాలందరినీ చూడాలని అనిపించి పెదపాలెం వచ్చానని తెలిపారు.

Cricketer Teja Nidamanuru in Home Village :ఇటీవల జరిగిన ప్రపంచకప్​లో టీం ఇండియా (Team India)పై 50 వరుగులు చేయడం, అది ఆటలో భాగమేనని తేజ అన్నారు. విజయవాడలోనే పుట్టానని అందువల్ల తాను హీరోలుగా చూసిన క్రికెటర్లతో పోటీ అనగానే కొంత ఉత్సాహం కలిగించిందని, వారితో ఆడే అవకాశం రావడంఅదృష్టమని తెలిపారు. పోటీ అన్న తర్వాత ఆడాల్సిందేనని అన్నారు. మ్యాచ్ అయిన తర్వాత భారత క్రికెటర్లతో మాట్లాడానని చెప్పారు. త్వరలో దక్షిణాఫ్రికా పర్యటన ఉందని, ఆ తర్వాత నేపాల్ సిరీస్ ఆడాలని తెలిపారు. వచ్చే ఏడాది జూన్​లో జరిగే టీ20 వరల్డ్ కప్​లో (T20 World Cup 2024) పాల్గొంటానని తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details