ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Nellore police seized 75kgs ganja

ETV Bharat / videos

Nellore Police Seized 75 Kgs Ganja: నెల్లూరు జాతీయ రహదారిపై కారు బోల్తా.. 75 కేజీల గంజాయి పట్టివేత - నెల్లూరు జిల్లా 75 కేజీల గంజాయి కేసు న్యూస్

By

Published : Aug 10, 2023, 6:09 PM IST

Nellore Police Seized 75 Kgs Ganja: నెల్లూరు జాతీయ రహదారిపై 75 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ నుంచి వస్తున్న ఓ కారు నెల్లూరు వద్ద జాతీయ రహదారిపై బోల్తా పడింది. డ్రైవర్ వేగంగా నడుపుతూ సడన్​ బ్రేక్ వేయటం వల్ల కారు పల్టీ కొట్టింది. దీంతో కారులో ఉన్న ముగ్గురికి స్వల్ప గాయలు అయ్యాయి. కారు వెనక భాగంలో ఉన్న 75 కేజీల గంజాయి బయట పడింది. పోలీసులు రాకతో ఆ ముగ్గురు వ్యక్తులు అక్కడ నుంచి స్వల్ప గాయాలతో పరారయ్యారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో ఉన్న 75 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ ఘటనలో కారు ముందు భాగం తుక్కుతుక్కైంది. పరారైన ముగ్గురు నిందితుల కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. పట్టుపడిన 75 కేజీల గంజాయి విలువ లక్షల్లో ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details