National Leaders Supported Chandrababu Naidu: చంద్రబాబు అరెస్టు ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ.. లోకేశ్‌కు వివిధ రాష్ట్రాల నేతల పరామర్శ - I Am with babu
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 21, 2023, 8:29 AM IST
National Leaders Supported Chandrababu Naidu : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను వివిధ రాష్ట్రాల పార్టీ నేతలు పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ.. న్యాయపోరాటం చేస్తున్న లోకేశ్‌కు.. తమ పూర్తి మద్దతు ఉంటుందని హరియాణా ఉపముఖ్యమంత్రి దుశ్యంత్ చౌతాలా, బీఎస్పీ లోక్‌సభాపక్ష నేత డానిష్ అలీ, ఎంపీ రీతేష్ పాండే, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే కుమారుడు శ్రీకాంత్ శిందే, బిజూజనతాదళ్ లోక్‌సభాపక్ష నేత, సీనియర్ న్యాయవాది పినాకీ మిశ్రా, ఎంపీ శ్రీరంగ్ అప్పా బార్నేలు బుధవారం దిల్లీలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు తెలిపారు. టీడీపీ చేస్తున్న ధర్మ పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, అంతిమంగా న్యాయమే గెలుస్తుందని భరోసా ఇచ్చారు. రాజకీయ కక్ష సాధింపునకు చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చగా పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు సంబంధించి.. రూపొందించిన బుక్ లెట్‌ని లోకేశ్ వారికి అందజేశారు. శ్రీకాంత్ శిందే మాట్లాడుతూ.. తన తండ్రి మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టిన సమయంలో తాను చంద్రబాబును కలిసి రాష్ట్ర అభివృద్ధికి సలహాలు, సూచనలు తీసుకున్నట్లు గుర్తుచేశారు. కనీస ఆధారాల్లేకుండా గొప్ప నాయకుడిని అరెస్టు చేశారని పినాకీ మిశ్రా ఆవేదన చెందారు. ఈ సందర్భంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు సంబంధించి.. రూపొందించిన బుక్ లెట్‌ని లోకేశ్ వారికి అందజేశారు.