ఆంధ్రప్రదేశ్

andhra pradesh

lokesh_yuvagalam_padayatra

ETV Bharat / videos

ఉత్సాహంగా సాగిన లోకేశ్​ పాదయాత్ర- అడుగడుగునా నిరాజనం పలికిన యువత, మహిళలు - AP Latest News

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 2, 2023, 10:33 PM IST

215 day Nara Lokesh Yuvagalam Padayatra:తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉత్సాహంగా సాగింది. 215వ రోజు కాకినాడ గ్రామీణ మండలం తిమ్మాపురం నుంచి ప్రారంభమైన పాదయాత్ర. సామర్లకోట మండలం పవర మీదుగా చిత్రాడ వద్ద పిఠాపురం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. పిఠాపురంలో భోజన విరామం అనంతరం యాత్ర కొనసాగించారు. కొండవరం, నవకాండ్రవాడ మీదుగా యండపల్లి జంక్షన్ వరకు సాగింది. పిఠాపురంలో రహదారికి ఇరువైపులా బారులు తీరి జనం లోకేశ్​కు ఘన స్వాగతం పలికారు. మహిళలలు మంగళహారతులు ఇచ్చారు. 

యువత సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. టీడీపీ-జనసేన శ్రేణులు లోకేశ్​కు ఘన స్వాగతం పలికారు. మస్యలు పరిష్కరించాలంటూ న్యాయవాదులు, ప్రైవేటు టీచర్లు, ఎస్సీ, బీసీ, మైనారిటీలు వినతి పత్రాలు సమర్పించారు. విద్యార్థులు, మహిళలు, యువత లోకేశ్​తో కలిసి నడిచారు. టీడీపీ పిఠాపురం ఇంఛార్జ్ వర్మ, జనసేన ఇంఛార్జ్ ఉదయ్ శ్రీనివాస్, ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేలు చినరాజప్ప, నిమ్మల రామానాయుడు, టీడీపీ నాయకుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ తదితర నాయకులు పాదయాత్రలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details