ఆంధ్రప్రదేశ్

andhra pradesh

యువగళం పాదయాత్ర

ETV Bharat / videos

Nara Lokesh: నాగలి పట్టి దుక్కి దున్నిన నారా లోకేశ్.. ఎక్కడంటే..? - టీడీపీ వార్తలు

By

Published : Apr 19, 2023, 7:20 PM IST

Lokesh Padayatra: యువగళం పాదయాత్రలో నిత్యం స్థానికులతో కలిసిపోయి వారి సమస్యలపై అవగాహన చేసుకుంటూ.. వారిలో భరోసా కల్పిస్తూ.. వారితో మమేకమవుతున్న తెలుగుదేశం   జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేడు రైతులతో కలిసి పొలం దున్నారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలోని కారుమంచి సమీపంలో రైతుతో పాటుగా లోకేశ్  పొలంలో నాగలి పట్టి దుక్కి దున్నుతున్న రైతు వద్దకు వెళ్లాడు. ఆ రైతుతో పాటు లోకేశ్ సైతం నాగలి పట్టి దుక్కి దున్నాడు. లోకేశ్​తో పాదయాత్ర చేస్తున్న యువకులు, స్థానికులు ఒక్కసారిగా ఈలలు, కేకలు వేశారు. కొంత దూరం వరకు లోకేశ్  దుక్కి దున్నాడు. ఈ సందర్భంగా నారా లోకేశ్ రైతుల సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాడు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని లోకేశ్ వెల్లడించారు. 

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం కారుమంచిలో బీసీ సామాజికవర్గం ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. జగన్.. 10 శాతం రిజర్వేషన్లు కట్ చేసి స్థానిక సంస్థల్లో 16,500 మంది బీసిలకు పదవులు దక్కకుండా  చేశారని లోకేశ్​ ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలు పరిష్కారం చెయ్యమని అడిగితే.. బెంజ్ మంత్రి బీసీలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు. 

ABOUT THE AUTHOR

...view details