Lokesh Yuvagalam in Addanki 'అద్దంకిని ప్రకాశం జిల్లాలో కలుపుతాం'.. అశేష జనసంద్రమైన లోకేశ్ పాదయాత్ర - టీడీపీ గెలిస్తే అద్దంకి ప్రకాశం జిల్లాలో కలుపుతాం
Nara Lokesh Yuvagalam Padayatra : తెలుగుదేశానికి పట్టం కడితే బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకిని తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు. టీడీపీ నేత గొట్టిపాటి రవికుమార్ ఆధ్వశ్యంలో లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రస్తుతం అద్దంకి నియోజకవర్గంలో 170వ రోజు జరుగతోంది. నారా లోకేశ్‌ను గజమాలతో గొట్టిపాటి, కార్యకర్తలు సత్కరించారు. లోకేశ్ అడుగుపెట్టిన ప్రతీచోట ఆయనకు విశేష స్పందన లభిస్తోంది.సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమంలో యువతీ యువకులు, అభిమానులు పోటీపడ్డారు.
ప్రజాగళంగా మారుతున్న లోకేశ్ యువగళం పాదయాత్రను అధికార పార్టీ నేతల వెన్నలో ఒణుకు పడుతందని టీడీపీ నేతలు అంటున్నారు. ఆగస్టు 1 వ తేదీన పల్నాడు జిల్లాలో లోకేశ్ అడుగు పెట్టనున్నారు. ఈ నూజెండ్ల మండలం ముప్పరాజువారిపాలెం వద్ద ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను జిల్లా నేతలు పరిశీలించారు.
నాలుగున్నర ఏళ్ల వైసీపీ పాలనలో అవినీతి సామ్రాజ్యాలుగా ఏర్పడిన పల్నాడు జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో లోకేశ్ యువగళం పాదయాత్ర జరగబోతుందని, ఆయా నియోజకవర్గాల్లో జరిగిన అవినీతి అక్రమాలపై ఆయన చాలెంజ్ చేయబోతున్నారని, దమ్ముంటే వైసీపీ అక్రమార్కులు చాలెంజ్‌కి సిద్దమేనా అంటూ మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు సవాల్ విసిరారు.