Nara Lokesh Will Come From Delhi to AP Today: దిల్లీ నుంచి ఏపీకి లోకేశ్.. శుక్రవారం చంద్రబాబుతో ములాఖత్.. - చంద్రబాబు అరెస్టు న్యూస్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 5, 2023, 10:46 AM IST
Nara Lokesh Will Come From Delhi to AP Today: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేడు దిల్లీ నుంచి రాష్ట్రానికి తిరిగి రానున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు కేసుకు సంబంధించి న్యాయవాదులతో సంప్రదింపులు, ఇతర పార్టీ నేతలతో సమన్వయం కోసం ఆయన గత నెల 14వ తేదీన రాజమండ్రి నుంచి దిల్లీకు బయలుదేరి వెళ్లారు. అప్పటినుంచి ఆయన దిల్లీలో వివిధ రూపాల్లో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. కాగా.. లోకేశ్ ఈ రోజు రాత్రి 8 గంటల సమయంలో దిల్లీ నుంచి గన్నవరం రానున్నారు. అక్కడినుంచి రోడ్డు మార్గం ద్వారా రాజమండ్రికి చేరుకోనున్నారు. అనంతరం రేపు రాజమండ్రి కేంద్ర కారాగారంలో చంద్రబాబుతో లోకేశ్ ములాఖత్ కానున్నారు. జనసేన పార్టీతో సమన్వయం కోసం తెలుగుదేశం తరుఫున ఏర్పాటుకానున్న ఐదుగురితో కూడిన కమిటీ సభ్యుల పేర్లు ఈ భేటీలో ఖరారు అయ్యే అవకాశం ఉంది.