పేదోళ్ల కడుపు మంటలే వైసీపీ ప్రభుత్వానికి చితి మంటలు : నారా లోకేశ్ - అన్న క్యాంటీన్ పై నారా లోకేష్ వ్యాఖ్యలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 29, 2023, 5:27 PM IST
Nara Lokesh Selfie Challenge To CM Jagan : తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తిరిగి ప్రారంభించిన "యువగళం పాదయాత్ర 2.O" గతంలో కంటే రెట్టింపు ఉత్సాహంతో దూసుకుపోతుంది. అధికార పార్టీ వైఫల్యాలను, అక్రమాలను లోకేశ్ ఎండగడుతున్నారు. ప్రస్తుతం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో పాదయాత్ర సాగుతోంది. ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు వర్షం కురిపించారు.
Nara Lokesh Yuvagalam Padayatra in Mummidivaram at Konaseema District :ముమ్మిడివరం యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ మాట్లాడుతూ.. పేదల కడపు నింపేందుకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన అన్నా క్యాంటీన్లను (Anna Canteen) మూసివేసి సీఎం జగన్ పైశాచికానందం పొందారని విమర్శించారు. పాదయాత్రలో అన్నా క్యాంటీన్‌ను వార్డు సచివాలయంగా మార్చడాన్ని గమనించిన లోకేశ్.. అక్కడే నిలబడి సీఎం జగన్‌కు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. టీడీపీ ప్రభుత్వం ముమ్మడివరంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ భవనాన్ని, ప్రస్తుతం వార్డు సచివాలయంగా మార్చేశారని తెలిపారు.
Anna Canteen Closed in AP : రాష్ట్ర వ్యాప్తంగా అన్నాక్యాంటీన్లు ఏర్పాటుచేసి లక్షలాదిమంది ఆకలి తీరిస్తే, వాటిని రద్దు చేసి పేదోళ్ల నోటికాడ కూడు సైకో జగన్ లాగేశాడని లోకేశ్ దుయ్యబట్టారు. జగన్ పేదల పక్షమంటూ వేదికలు ఎక్కి ఉపన్యాసాలు ఇస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకలితో అలమటించే పేదోళ్ల కడుపుమంటలే వైసీపీ ప్రభుత్వానికి చితిమంటలు కాబోతున్నాయని హెచ్చరించారు.