ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Nara_Lokesh_Satirical_Tweet_On_CM_Jagan_Bail

ETV Bharat / videos

జగన్ 6093 ఖైదీ డ్రెస్ వేసుకునే టైం వచ్చింది - 10 ఏళ్లుగా జగన్ వ్యవస్థలను మేనేజ్‌ చేస్తున్నాడు : నారా లోకేశ్ - బెయిల్ రద్దుపై సీఎం జగన్ రెడ్డికి నోటీసు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 25, 2023, 1:30 PM IST

Nara Lokesh Satirical Tweet On CM Jagan Bail :అవినీతి సొమ్ముతో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇంకెంతోకాలం వ్యవస్థలను మేనేజ్‌ చేయడలేడని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. చట్టం, న్యాయం తన పని తాను చేయడం మొదలు పెట్టిందని హెచ్చరించారు. 10 ఏళ్లుగా జగన్ వ్యవస్థలను మేనేజ్‌ చేశాడని విమర్శించారు. సుప్రీంకోర్టు నోటీసులతో జగన్‌, అతని ముఠా పనైపోయిందని లోకేశ్ ధ్వజమెత్తారు. అవినీతి చక్రవర్తి జగన్ ఇక తన ఖైదీ డ్రెస్‌ 6093 వేసుకునే సమయం ఆసన్నమయ్యిందని, ఉతికించి పెట్టుకోవాలంటూ ట్విటర్(X) వేదికగా లోకేశ్ హితవు పలికారు.

CM Jagan Bail Cancellation Petition in Supreme Court..సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ.. ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. బెయిల్‌ రద్దు చేయాలా అని ధర్మాసనం ప్రశ్నించగా.. నోటీసులు ఇచ్చి తదుపరి ప్రక్రియ చేపట్టాలని రఘురామ తరఫు న్యాయవాది కోరారు. దీంతో జగన్‌, సీబీఐ సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి తొలి వారానికి వాయిదా వేసింది.

ఆర్థిక అవకతవకలు.. విచారణ డిసెంబర్ 14కు వాయిదా : పిటిషన్‌  రాష్ట్రంలో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ రఘురామకృష్ణ రాజు దాఖలు చేసిన పిటిషన్‌ పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. విచారణకు సంబంధించి సీఎం జగన్​, మంత్రులు, అధికారులు సహా మొత్తం 41 మందికి నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details