ఆంధ్రప్రదేశ్

andhra pradesh

lokesh_reacts_on_blind_woman_suicide

ETV Bharat / videos

జగన్ ప్రభుత్వపు అడ్డగోలు నిబంధనలు ఓ దివ్యాంగురాలి ప్రాణం తీశాయి: లోకేశ్​ - AP Latest News

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 11, 2023, 12:23 PM IST

Nara Lokesh Reacts on Blind Woman Suicide:సైకో జగన్ కళ్లు ఉండీ చూడలేని అంధపాలకుడయ్యాడని, జగన్ ప్రభుత్వం విధించిన అడ్డగోలు నిబంధనలు ఓ దివ్యాంగురాలి ప్రాణం తీశాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లా గుంతకల్ మండలం నక్కనదొడ్డికి చెందిన సరోజకు రెండు కళ్లు కనిపించవని, కానీ ఆమె తమ్ముడికి ఉద్యోగం వచ్చింది అనే కారణం చూపి ఏడాదిగా ఆమె పెన్షన్ నిలిపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకున్న ఏకైక ఆసరా కోల్పోయాననే బెంగతో సరోజ ఆత్మహత్యకు పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సైకో జగన్‌ పాలనకు ఇంకెంత మంది దివ్యాంగులు, వృద్ధులను బలి కావాలని లోకేశ్​ మండిపడ్డారు.

ఇదీ జరిగింది: నక్కనదొడ్డి గ్రామానికి చెందిన సరోజమ్మ పుట్టుకతోనే అంధురాలు, రెండు చెవులు వినిపించవు. తల్లి, తమ్ముడు ఉన్న రేషన్ కార్డులోనే మృతురాలు సరోజమ్మ కూడా ఉన్నారు. తమ్ముడికి లోకో పైలట్ ఉద్యోగం రావడంతో సరోజమ్మకు పింఛన్ తొలగించారని కుటుంబసభ్యులు తెలిపారు. ఏడాది నుంచి పింఛన్ కోసం అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ABOUT THE AUTHOR

...view details