Nara Lokesh Reacted on CM Jagan Bail: "జగన్మోహన్ రెడ్డికి బెయిల్ డే పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు" - జగన్ బెయిల్పై స్పందన
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 23, 2023, 1:50 PM IST
Nara Lokesh Reacted on CM Jagan Bail:ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బెయిల్ డే పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు అంటూ.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యంగ్యంగా స్పందించారు. జగన్ రెడ్డి 42వేల కోట్ల రూపాయల ప్రజాధనం దోచేసి.. సీబీఐ - ఈడీ పెట్టిన 38 కేసుల్లో A1 గా ఉన్నారని ఆరోపించారు. ఇన్నీ కేసుల ఆరోపణలున్నా.. పదేళ్లుగా బెయిల్పై ఉన్న ఆర్థిక ఉగ్రవాది జైలు మోహన్ ప్రజాస్వామ్య వ్యవస్థలను ధ్వంసం చేస్తూరని మండిపడ్డారు. రాజ్యంగాన్ని కాలరాస్తూ నీతిమంతుల్ని జైలుకు పంపుతున్నాడని దుయ్యబట్టారు. జైలులో ఉండాల్సిన జగన్ పది సంవత్సరాలుగా బెయిల్పై ఉంటే.. ప్రజలలో ఉండాల్సిన నిజాయితీపరుడు సీబీఎన్ జైలులో ఉన్నారంటూ లోకేశ్ ఆరోపించారు.
కోర్టు బెయిల్పై దర్జాగా జీవీస్తూ.. బెయిల్ కాలాన్ని10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి పట్టరాని ఆనందంతో పదో బెయిల్ వార్షికోత్సవం జరుపుకుంటున్నారని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. జగన్ రెడ్డి సాధించిన ఈ గొప్ప ఘనతను గుర్తించి.. ఎక్కువ కాలం బెయిల్పై జీవించిన వ్యక్తిగా.. ఆయనకు ఓ రికార్డ్ ఇవ్వాలని వ్యంగ్యంగా స్పందించారు. అంతేకాకుండా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ వారికి మెయిల్ పెట్టినట్లు వివరించారు.