Nara Lokesh Pawan Kalyan Flexies: యువగళం పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం.. ఒకే ఫ్లెక్సీలో నారా లోకేశ్, పవన్ కల్యాణ్! - Pawan Kalyan
Nara Lokesh Pawan Kalyan Flexies: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లకు యువతలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి సభలకు వస్తున్న స్పందనని చూస్తేనే అది తేలిపోతుంది. ప్రస్తుతం నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో దూసుకుపోతుండగా.. మరోవైపు పవన్ కల్యాణ్ వారాహి యాత్రతో సంచలనం సృష్టిస్తున్నారు. ఇద్దరు నేతలు.. వైసీపీ పాలనపై విరుచుకుపడుతుండగా.. యువత నుంచి భారీగా స్పందన వస్తుంది. ఈ క్రమంలో పల్నాడు జిల్లాలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. యువగళం పల్నాడు జిల్లాలో జరుగుతున్న లోకేశ్ యువగళం పాదయాత్రలో ఆసక్తికర ఫ్లెక్సీలు కనిపించాయి. పెదకూరపాడు నియోజకవర్గంలో సాగుతున్న యువగళం యాత్రలో లోకేశ్‌కు స్వాగతం పలికేందుకు కొందరు యువకులు పొడపాడు వద్ద.. లోకేశ్, పవన్ కల్యాణ్‌లు కలిసి ఉన్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇవి ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. స్థానికులతో పాటు పాదయాత్రకు వచ్చిన వారు సైతం ఈ ఫ్లెక్సీలను ఆసక్తిగా చూస్తున్నారు.