ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Nara_Lokesh_on_SV_Arts_College_Student_Suicide

ETV Bharat / videos

వైసీపీ వీధిరౌడీల్లా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది - ఎస్వీ ఆర్ట్స్ కాలేజ్ ఘటనపై లోకేశ్ ఆగ్రహం - ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ విద్యార్థిపై దాడి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 2, 2023, 9:38 PM IST

Nara Lokesh on SV Arts College Student Suicide: ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ విద్యార్థులపై అత్యంత దారుణంగా దాడి చేసిన‌వారు టీటీడీ విజిలెన్స్ సిబ్బందిలా లేర‌ని, వైసీపీ వీధిరౌడీల్లా ఉన్నార‌ని, క‌క్షతోనే ఫ‌స్టియ‌ర్‌ విద్యార్థిని చంపేశార‌ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేశ్ ఆరోపించారు. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది దాడితో తీవ్ర మ‌న‌స్తాపానికి గురై ఆత్మహ‌త్యకి పాల్పడిన విద్యార్థి జితేంద్రకుమార్ ది ఆత్మహ‌త్య కాద‌ని, ఇది ముమ్మాటికీ వైసీపీ స‌ర్కారు చేసిన‌ హ‌త్య అని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేత‌ల అనుచ‌ర‌గ‌ణంతో క‌లిసి విజిలెన్స్ సిబ్బంది హాస్టల్‌లో చేస్తున్న పెత్తనాన్ని ఎదిరించినందుకే జితేంద్ర కుమార్​పై క‌క్ష క‌ట్టి మ‌రీ అంతం చేశార‌ని మండిపడ్డారు. 

విద్యార్థిపై విజిలెన్స్ సిబ్బంది దాడిచేసి తీవ్రంగా కొడితే కాలేజీ యాజ‌మాన్యం ఎందుకు స్పందించ‌డం లేద‌ని ప్రశ్నించారు. టీటీడీ అధికారులు, ఛైర్మన్‌, ఎస్వీ ఆర్ట్స్ క‌ళాశాల యాజ‌మాన్యం విద్యార్థి మృతిపై స్పందించ‌క‌పోవ‌డం అనుమానాల‌కి తావిస్తోంద‌న్నారు. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది దాడి వ‌ల్ల చ‌నిపోయిన జితేంద్రకుమార్ కుటుంబానికి 50 ల‌క్షలు ప‌రిహారం చెల్లించాల‌ని డిమాండ్ చేశారు. కార‌కుల‌ని క‌ఠినంగా శిక్షించాల‌ని, ఎస్వీ ఆర్ట్స్ క‌ళాశాల‌లో మితిమీరిన వైసీపీ రాజ‌కీయ జోక్యానికి ఫుల్ స్టాప్ పెట్టాల‌ని లోకేశ్ స్పష్టం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details