Nara Lokesh on IT Employees Car Rally ఐటీ ఉద్యోగుల వాట్సాప్ డాటా తనిఖీపై లోకేశ్ మండిపాటు.. ఉత్తర కొరియా పాలనంటూ ఆగ్రహం - నారా లోకేశ్ ఆన్ జగన్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 24, 2023, 7:44 PM IST
Nara Lokesh on IT Employees Car Rally: ఉత్తర కొరియా తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో అణచివేతల పాలన కొనసాగుతుందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతున్నారంటూ... లోకేశ్ ట్విట్టర్ ద్వారా మండిపడ్డారు. ఐటీ ఉద్యోగుల కార్ ర్యాలీని ఆపడాని లోకేశ్ ఖండించారు. కార్ ర్యాలీని ఆపడానికి వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ప్రజల ఫోన్‌లలో వాట్సాప్ డేటాను సైతం తనిఖీ చేస్తున్నారని లోకేశ్ మండిపడ్డారు. వైసీపీ దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతొందని లోకేష్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంతటి క్లిష్టపరిస్థితుల్లో నైనా వ్యక్తుల గోప్యతకు భంగం కలిగించరాదనే నిబంధనలను లోకేశ్ గుర్తుచేశారు. కానీ, నేడు కారు ర్యాలీల తనిఖీల పేరుతో... పోలీసులు వ్యక్తుల గోప్యతకు భంగం కలిగించే చర్యలకు ఉపక్రమించారని లోకేశ్ మండిపడ్డారు. అయితే, ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ నుంచి రాజమండ్రీకి రావడానికి అనుమతి లేదంటూ... పోలీసులు ఉదయం నుంచి పలు ఆంక్షలు పెట్టారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ... చివరకు ఐటీ ఉద్యోగులు రాజమండ్రీలో నారా చంద్రబాబు కుటుంబాన్ని కలిసి వారిని పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. తామంతా బాబుతోనే ఉంటామని నారా భువనేశ్వరి, బ్రాహ్మిణులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.
TAGGED:
nara news