Nara Lokesh Meeting with Auditors: కక్షసాధింపులు చేస్తే కంపెనీలు రావు! రాజకీయం వేరు.. వ్యాపారం వేరు!: లోకేశ్ - nara lokesh yuvagalam padayatra
Nara Lokesh Meeting with Auditors: ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనాడు వార్తలు రాస్తోందని.. మార్గదర్శిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనాడు వార్తలు రాస్తోందని.. మార్గదర్శిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. యువగళం పాదయాత్రలో భాగంగా తాడికొండ వద్ద ఆడిటర్లతో నారా లోకేశ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి, ఆడిటర్ల సమస్యలను నారా లోకేశ్ అడిగి తెలుసుకున్నారు. చార్టెడ్ అకౌంటెంట్లపై ప్రభుత్వం కేసులు పెడుతోందని.. సీఐడీ ద్వారా కేసులు పెట్టి వేధిస్తోందని లోకేశ్ దృష్టికి ఆడిటర్లు తీసుకొచ్చారు. తమకు సంబంధం లేని వ్యవహారాల్లో కేసులు పెట్టారని, రాజకీయ కక్షలతో అరెస్టులు చేశారని ఆడిటర్ల వాపోయారు. అరెస్టు విషయంలో కనీస నిబంధనలు పాటించలేదని ఆడిటర్ల తెలిపారు. ఆడిటర్ల సమస్యలపై స్పందించిన లోకేశ్.. మార్గదర్శి ఉద్యోగులనూ టార్గెట్ చేసి.. సీఐడీతో వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం ప్రతీదీ రాజకీయంగా చూస్తోందని.. ఇవన్నీ చూసి మార్గదర్శి వంటి సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెడతాయా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ వేధింపులపై.. ఆడిటర్లు లోకేశ్‌కు గోడు వెల్లబోసుకున్నారు. సీఐడీ ద్వారా ప్రభుత్వం కేసులు పెడుతున్న విషయం లోకేశ్ దృష్టికి తెచ్చారు.