ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Lokesh_Fires_on_CBN_Fake_Letter

ETV Bharat / videos

'చంద్రబాబు ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు వైసీపీ దొంగ లేఖ - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు తెలుగుదేశం దూరం' - CBN Letter

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 9, 2023, 3:33 PM IST

Nara Lokesh Fires on Chandrababu Fake Letter:తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని కమ్మ సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు లేఖ రాసినట్లుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న లేఖపై.. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఘాటుగా స్పందించారు. జగన్ కిరాయి మనుషులు చంద్రబాబు పేరుతో ఒక ఫేక్ లెటర్ వదిలారని దుయ్యబట్టారు. ప్రజా విశ్వాసం కోల్పోయిన వైసీపీ ఫేక్ ఎత్తుగడల పట్ల ప్రజలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

Nara Lokesh Tweet: ''కుల, మత, ప్రాంత విద్వేషాలు రెచ్చగొడుతూ.. పైశాచిక ఆనందం పొందే సైకో జగన్ మోహన్ రెడ్డి కిరాయి మనుషులు.. చంద్రబాబు పేరుతో ఒక ఫేక్ లెటర్ వదిలారు. ప్రజా విశ్వాసం కోల్పోయిన వైసీపీ ఫేక్ ఎత్తుగడల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఒక్క యూనిట్ కూడా వాడని ఇంటికి 295 కరెంట్ బిల్లు బాదిన ఘనత జగన్ ప్రభుత్వానికే చెల్లుతుంది. సొంత పేపర్, ఛానెల్, సిమెంట్, విద్యుత్ కంపెనీలు, ఊరికో ప్యాలెస్ ఉన్న అవినీతి అనకొండ, పెత్తందారుడు జగన్. పేదలకి రూపాయి స్కీం ఇచ్చి వెయ్యి రూపాయలు దోచే స్కాం చేస్తున్నాడు. జనాన్ని క్యాన్సర్ గడ్డలా పట్టి పీడిస్తున్న జగన్‌.. బిడ్డ ఎలా అవుతావు.' అని లోకేశ్ ట్వీట్ చేశారు. 

''చంద్రబాబు లేఖ రాసినట్లు ఒక ఫేక్ లేఖ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. దానిని ఎవరూ నమ్మొద్దు. తెలంగాణ ఎన్నికలపై చంద్రబాబు ఎవరికీ ఎలాంటి సూచనలు చేయలేదు. చంద్రబాబు ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు వైసీపీ ఆ దొంగ లేఖ సృష్టించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు తెలుగుదేశం దూరంగా ఉంది. చంద్రబాబు.. పార్టీ కార్యకర్తలకు గానీ, అభిమానులకు గానీ ఎవరికి ఓటెయ్యాలి అనే విషయంపై ఎటువంటి సూచనలు చేయలేదు. చంద్రబాబు సంతకం ఫోర్జరీ చేసి లేఖను తయారు చేశారు. లేఖపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం.''-కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు 

ABOUT THE AUTHOR

...view details