ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Nara Lokesh Shocking Comments On YS Jagan

ETV Bharat / videos

Nara Lokesh Fire on CM Jagan: జగన్​ జే ట్యాక్స్​ రూపంలో ప్రజల రక్తాన్ని తాగుతున్నారు: జంగారెడ్డిగూడెం సభలో లోకేశ్​ - లోకేశ్ వర్సెస్ వైసీపీ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 30, 2023, 10:26 PM IST

Nara Lokesh Fire on CM Jagan in Jangareddygudem Public Meeting: తెలుగింటి ఆడపడుచుల కన్నీరు తుడిచే బాధ్యత తనదనీ.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. టీడీపీ అధికారంలోకి  వచ్చిన వెంటనే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. 199వ రోజు యువగళం పాదయాత్ర సందర్భంగా  ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఏర్పాటు చేసిన  బహిరంగ సభలో నారా లోకేశ్ ప్రసంగించారు.  ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీకి  కంచుకోటలాంటిదని నారా లోకేశ్ తెలిపారు.  గోదావరి జిల్లాల్లో మమకారం, వెటకారం రెండూ అద్భుతంగా ఉంటాయంటూ నారా లోకేశ్  చలోక్తులు విసిరారు.  వివిధ కార్పొరేషన్ ద్వారా బీసీలకు రుణాలిచ్చి ఆదుకుంటామని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో మెుదలుపెట్టిన... వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత... దళితులకు నిలిపేసిన 26 సంక్షేమ పథకాలను మళ్లీ అమలు చేస్తామని లోకేశ్  పేర్కొన్నారు.   రైతులకు పాస్‌బుక్‌ ఇవ్వాలన్నా కప్పం కట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని లోకేశ్  విమర్శలు చేశారు.  తాము వచ్చాక చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆ ప్రాంత ప్రజలకు నారా లోకేశ్  హామీ  ఇచ్చారు. 

పామాయిల్ రైతులకు ఉచితంగా మొక్కలు అందిస్తామని పేర్కొన్నారు.  ఎన్ని ఎక్కువ కేసులుంటే అంతపెద్ద నామినేటెడ్ పదవి ఇస్తామని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయని ఆరోపించారు. ఈ ప్రభుత్వం టీడీపీ కార్యకర్తలపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేసే బాధ్యత  తాను తీసుకోనున్నట్లు లోకేశ్ తెలిపారు.  టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పడు వైఎస్ జగన్ పాదయాత్రను ఎప్పుడూ అడ్డుకోలేదు.. పైగా  భద్రత కల్పించామని లోకేశ్ పేర్కొన్నారు. తాను  పాదయాత్ర చేస్తుంటే అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని  లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుది పోలవరం స్థాయి.. జగన్‌ది మురికి కాలువ స్థాయి అంటూ విమర్శలు గుప్పించారు. సామాన్యులకు తిరుమల శ్రీవారిని దూరం చేసిన వ్యక్తి.. జగన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని లోకేశ్ ఎద్దేవా చేశారు. వైఎస్‌ కుటుంబసభ్యులే జగన్‌ను నమ్మడం లేదని లోకేశ్ విమర్శించారు. జే ట్యాక్స్ రూపంలో ప్రజల రక్తాన్ని జగన్‌ తాగుతున్నారని నారా లోకేశ్ మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details