Lokesh on Jagan: వాళ్లని విచారిస్తేనే వివేకా హత్య కేసులో అసలు విషయం బయటకు వస్తోంది: లోకేశ్ - Nara Lokesh Comments
Nara Lokesh Comments on CM Jagan: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. హత్య అర్ధరాత్రి జరిగితే తెల్లవారుజామున లోటస్ పాండ్లో జగన్ మీటింగ్ పెట్టారన్నారు. ఆ మీటింగ్లో ఉన్న నలుగురు ముఖ్యమైన వ్యక్తులకు గుండెపోటుతో బాబాయ్ చనిపోయాడు అని జగన్ చెప్పాడని ఆరోపించారు. అంటే అప్పటికే వివేకా మృతదేహానికి కుట్లు వేసి కట్టుకట్టే కార్యక్రమం పూర్తి చేశారని విమర్శించారు. ఆ మీటింగ్లో ఉన్న నలుగురిని విచారిస్తే నిజమైన మాస్టర్ మైండ్ దొరికిపోవడం ఖాయమని లోకేశ్ అన్నారు. కర్నూలు జిల్లా కోడుమూరులో యువగళం పాదయాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. నారా లోకేశ్ 88వ రోజు పాదయాత్ర కర్నూలు జిల్లా కోడుమూరు విడిది కేంద్రం నుంచి ప్రారంభం అయ్యింది. వెంకటగిరి, అనుగొండ మీదుగా పాణ్యం నియోజకవర్గంలోకి లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రవేశించనుంది.