జాబ్ క్యాలెండర్ పేరుతో జగన్ మాయమాటలు నమ్మి యువత మోసపోయింది: లోకేశ్ - జాబ్ క్యాలెండర్ పై వైసీపీ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 11, 2023, 10:07 PM IST
|Updated : Nov 12, 2023, 6:39 AM IST
Nara Lokesh alleges jagan: సీఎం జగన్ నాటకాలకు యువత బలవుతోందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) సామాజిక మాధ్యమంలో వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ (CM Jagan) ప్రతిపక్షంలో ఉండగా.. తాను అధికారంలోకి వస్తే... ప్రతి ఏటా జనవరి 1నే జాబ్ క్యాలెండర్ (Job Calendar) ఇస్తామన్న జగన్ మాయమాటలు చెప్పాడని ఆరోపించారు. జగన్ నమ్మిన యువత నేడు మోసపోయిందని లోకేశ్ పేర్కొన్నారు. ఈ నాలుగున్నరేళ్ల పాలనలో టీచర్ పోస్టుల భర్తీకి ఒక్క ప్రకటనా రాలేదని ఆక్షేపించారు. ఏటా 2 లక్షలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ (Jobs Notification) ఇస్తామని చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క ఉద్యోగాన్నీ ఇవ్వలేదని లోకేశ్ విమర్శలు గుప్పించారు. ఉపాధి లేక యువత తీవ్ర ఆందోళనలో ఉందన్న లోకేశ్... ఎవరూ అఘాయిత్యాలకు పాల్పడవద్దన్నారు పిలుపునిచ్చారు. ఒక్క 6 నెలలు ఓపిక పడితే... తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందన్న లోకేశ్.. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు.